Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన నుండి వాట్ టు డూ సాంగ్ విడుదల

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (18:12 IST)
Sree Vishnu
శ్రీవిష్ణు  కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది.
 
తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ 'వాట్ టు డూ' పాటని విడుదల చేసిన సామజవరగమన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని అందరికీ కనెక్ట్ అయ్యే క్యాచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. తనలోని ఫ్రస్టేషన్ ని చెబుతూ కథానాయకుడు పాడుకునే ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. జస్సీ గిఫ్ట్ ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో శ్రీవిష్ణు చేసిన మాస్ మూమెంట్స్ అలరించాయి.  
 
భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి  పని చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
 మే 18న వేసవి కానుకగా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.  

సంబంధిత వార్తలు

వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణమా? ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

వీసా విధానంలో మార్పు.. వెనక్కి తగ్గిన భారతీయ విద్యార్థులు

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

బస్సు చక్రాల కింద పడి 17 ఏళ్ల విద్యార్థిని మృతి.. కదిలే బస్సు నుంచి దిగుతూ..

బిర్యానీలో బల్లి.. నెట్టింట వీడియో వైరల్.. ఎక్కడ?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments