Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష అంటే నాకు ఇష్టమే.. ఇందులో తప్పేముంది?: జయం రవి

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (18:37 IST)
సమ్‌థింగ్ సమ్‌థింగ్ తమిళ రీమేక్‌లో త్రిషతో జతకట్టిన జయం రవి.. ప్రస్తుతం ఆమెను ప్రేమిస్తున్నాడని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న జయం రవి తాజా కామెంట్స్ సైతం ఆ వార్తలను ధ్రువీకరిస్తున్నాయి. వరుణ్ మణియన్‌తో బ్రేకప్‌కు తర్వాత చాలా బోల్డ్‌గా దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. తన పనేంటో తాను చేసుకుంటూ పోతున్న త్రిష.. జయం రవితో సగలకళావల్లవన్ అనే సినిమాలో నటిస్తోంది. 
 
చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జయం రవి మాట్లాడుతూ... త్రిష అంటే నాకు చాలా ఇష్టం.. ఇలా చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించాడు. త్రిషతో కలిసి మూడు సినిమాల్లో నటించారే ఆమెంటే మీకు అంత ఇష్టమా అని చాలామంది తనను అడుగుతున్నారని, అవును త్రిష అంటే తనకిష్టమేనని.. ఇందులో తప్పేముందని జయం రవి అన్నాడు. సగలకళావల్లవన్‌లో త్రిష రోల్‌కు మంచి పేరు వస్తుందని కొనియాడాడు. 
 
కాగా జూలై 31న జయం రవి, త్రిష జంటగా నటించిన సగలకళావల్లవన్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జయం రవి చేసిన కామెంట్స్.. ఆయన సంసార జీవితానికే ఎసరు పెట్టేలా ఉందని కోలీవుడ్ సినీ పండితులు అంటున్నారు. 
 
త్రిష అంటే ఇష్టమంటూ జయం రవి పబ్లిక్‌గా కామెంట్స్ చేయడం ద్వారా ఆయన భార్యతో ఇబ్బందులు తప్పవంటూ అభిప్రాయపడుతున్నారు. త్రిష అంటే తనకిష్టమనడం.. ఇంకా ఆమెను ప్రశంసల జల్లు కురిపించడంతో జయం రవి ఇంట్లో కష్టాలు తప్పవని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. కాగా జయం రవి, త్రిష మూడోసారి జంటగా నటించే సగలకళావల్లవన్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి, ప్రభు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూరజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments