కలియుగంలో రజినీకాంత్ దుర్యోధనుడు, నేను కర్ణుడిని: సినీ నటుడు మోహన్ బాబు
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబులు మంచి స్నేహితులు. వీరిద్దరు.. అరె.. ఒరే అని పిలుచుకునేంత చనువు ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల రజినీకాంత్‌తో మోహన్ బాబు కలిశారు. ఈ విషయాన
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబులు మంచి స్నేహితులు. వీరిద్దరు.. అరె.. ఒరే అని పిలుచుకునేంత చనువు ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల రజినీకాంత్‌తో మోహన్ బాబు కలిశారు. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
‘నా బెస్ట్ ఫ్రెండ్‌ను కలిశాను. కింగ్‌లా ఉన్నాడు! ఈ కలియుగంలో అతను దుర్యోధనుడు, నేను కర్ణుడు’ని అంటూ ఆ ట్వీట్‌లో తమ స్నేహబంధం గురించి గొప్పగా మోహన్ బాబు చెప్పుకున్నారు.
అంతేకాకుండా, ‘చాలా కాలం తర్వాత చెల్లెలు లతను కలిశాను. రజినీకాంత్ విజయం వెనుక ఆమె కూడా ఉందని నేను బలంగా నమ్ముతాను’ అంటూ మరో ట్వీట్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు. రజినీ, మోహన్ బాబు ఆప్యాయంగా ఉన్న ఫొటోలతో పాటు, రజినీ భార్య లత, తనకు రాఖీ కడుతున్న మరో ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.