Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్ర‌హ్మానందం చెప్పే పంచ తంత్రం ఏమిటి?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (16:24 IST)
Pancha Tantram poster
డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.
 
‘పంచతంత్రం’ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇది 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని అర్థ‌మ‌వుతుంది. డా.బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు పంచేద్రియాలు అనే పేరు పెట్టి త‌న కోణంలో స్టార్ట్ చేస్తార‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం. మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ముందుకెళ్లామ‌నేది క‌థాంశం అని క్లియ‌ర్‌గా తెలుస్తుంది. సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌బోయే ఐదు జంట‌ల‌కు ఒక్కో క‌థ .. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతుంది.
 
ప్ర‌తి క‌థ‌లో మ‌న చుట్టూ ఉన్న స‌మాజాన్ని అందులో వ్య‌క్తుల వ్య‌క్తిత్వాల‌ను ద‌ర్శ‌కుడు హ‌ర్ష ఎంతో అర్థ‌వంతంగా ముందుకు తీసుకెళ్లిన్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ యాంథాల‌జీని ద‌ర్శ‌కుడు ఎలా ట్రీట చేశార‌నే ఎగ్జ‌యిట్‌మెంట్ కూడా క‌లుగుతుంది.
 
అర్థ‌వంత‌మైన సంభాష‌ణ‌లు ప్ర‌తి పాత్ర‌లోని భావోద్వేగాల‌ను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి.
ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతం, నేప‌థ్య సంగీతం.. రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ స‌న్నివేశాల‌ను, వాటిలోని ఎమోష‌న్స్‌ను నెక్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. ట్రైల‌ర్ చూస్తున్న‌ప్పుడు మ‌న‌సుకు తెలియ‌ని ఆర్ద్ర‌త క‌లుగుతుంది.  సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా అనే ఆస‌క్తి పెరుగుతుంది.
 
 
నటీనటులు: డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:బ్యాన‌ర్స్‌:  టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్, నిర్మాత‌లు : అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  హ‌ర్ష పులిపాక‌, స‌హ నిర్మాత‌లు:  రమేష్ వీర‌గంధం, ర‌వ‌ళ్లి క‌ళంగి, సినిమాటోగ్ర‌ఫీ :  రాజ్ కె.న‌ల్లి, 
మ్యూజిక్‌:  ప్రశాంత్ ఆర్ విహారి - శ్రవణ్ భరద్వాజ్, ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఉషా రెడ్డి వ‌వ్వేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  భువన్ సాలూరు,  లైన్ ప్రొడ్యూస‌ర్‌:  సునీత్ ప‌దోల్క‌ర్‌, ప‌బ్లిసిటీ డిజైన్స్‌:  దినేష్ రెడ్డి, ప్రొడ‌క్ష‌న్ టీమ్‌:  అభిన‌య్ కృష్ణ‌, ర‌ఘురామ్ శ్రీపాద‌, అసోసియేట్ డైరెక్ట‌ర్‌:  విక్ర‌మ్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఆయేషా మరియం, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్‌ - ఫ‌ణి కందుకూరి ( బియాండ్ మీడియా ), డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్‌:  అన్న‌పూర్ణ‌, ఆడియో:  ల‌హ‌రి మ్యూజిక్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments