Webdunia - Bharat's app for daily news and videos

Install App

టక టకా... టక్ జగదీష్ షూటింగ్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (22:56 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ''టక్ జగదీష్'' చిత్రంపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి ప్రాజెక్టు ఆగిపోయిందంటే ఆగిపోయిందని, మరోసారి బడ్జెట్ తగ్గించారని వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఏకకంగా ఆ సినిమా దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్లో 'అన్‌స్టాపబుల్.. #టక్ జగదీష్ సెట్స్‌లో 38వ రోజు'' అంటూ ట్వీట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
 
పూర్తి స్థాయి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుందని ఆ వీడియో చెప్పకనే చెబుతోంది. అంతకుముందు కోవిడ్ ప్రభావంతో గత కొన్ని మాసాలుగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి హైదరాబాద్ లో ప్రారంభమైన సంగతి వెబినర్లకు తెలిసిందే. యూనిట్ లోని ఓ టెక్నీషియన్‌కి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ముందస్తు జాగ్రత్తగా సినిమా షూటింగ్ ఆపేశారని.. ప్రస్తుతం టీమ్ మొత్తం హోమ్ ఐసోలేషన్లో ఉందని వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
 
రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ పైన అంచనాలు బాగానే ఉన్నాయి. నాని కెరీర్లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్ జగదీష్' చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన సాహు గారపాటి మరియు హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

Green Hydrogen Project: గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌-స్వర్ణ ఆంధ్ర విజన్-2047 వైపు తొలి అడుగు

గంజాయితో దొరికిపోయిన ఐఐటీ బాబా!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments