వరుస హిట్లతో సినీ కెరీర్లో ఎంజాయ్ చేస్తున్న శ్రుతిహాసన్ తన ఫ్యాన్స్ కోసం సూపర్ ఫోటోను సామాజిక వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. డైరక్టర్ సీట్లో అలా కూర్చుని వెనక్కి చూస్తున్న ఫోటోలో శ్రుతిహాసన్ అతిక్కిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆఫర్లు చేజిక్కించుకుంటున్న శ్రుతిహాసన్.. తాజా ఫోటోను చూసి అందరూ షాక్ అవుతున్నారట.
ఇప్పటికే గాయనిగా, హీరోయిన్గా రాణిస్తున్న శ్రుతిహాసన్ త్వరలో మెగా ఫోన్ కూడా పట్టుకోనుందా అంటూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రోబో-2లో శ్రుతిహాసన్ నటించబోతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. రోబో 2లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా, ఫస్ట్ హీరోయిన్గా రాధికా ఆప్టే ఎంపికైనట్లు తెలుస్తోంది.