Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ జంట ప్రేమ విమానం ఎక్కితే ఏమి జరిగింది !

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (17:27 IST)
Prema Vimana First Look
గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రేమ విమానం అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.
 
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఇద్దరు పిల్లలు (దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా), హీరో హీరోయిన్లు (సంగీత్ శోభన్, శాన్వీ మేఘన), వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇలా అందరూ కూడా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.
 
ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట ఇలా అందరినీ ఒకే చోటకు చేర్చుతుంది కథ. ఇక వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి.
 
ఉన్నతమైన ప్రొడక్షన్ విలువలతో తెరకెక్కిన ప్రేమ విమానం కచ్చితంగా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.
 
నటీనటులు : సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

జార్ఖండ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌- ఒక మావోయిస్టు మృతి

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments