Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శివాయ్'' పబ్లిసిటీ కోసం రియాల్టీ షోకు అజయ్.. శిల్పాశెట్టికి బొద్దింకల గిఫ్ట్.. పారిపోయింది...

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ''శివాయ్''. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది దీప

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (16:40 IST)
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ''శివాయ్''. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ పబ్లిసిటీలో భాగంగా అజయ్ ముంబైలో సూపర్‌ డ్యాన్సర్‌ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి, కొరియోగ్రాఫర్‌ గీతా కపూర్‌, అనురాగ్‌ బసులు జ‌డ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అజయ్‌ షోకి వస్తూ శిల్పకి, గీతా కపూర్‌కి బహుమతులు తెచ్చాడు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో శిల్పా శెట్టికి అజ‌య్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ బాక్స్ లో ఏముందోనని ఆత్రుతగా తెర‌చి చూసిన శిల్పాశెట్టి అందులో ఉన్న బొద్దింక‌ల‌ను చూసి గట్టిగా కేక‌లు పెట్టింది. బాక్సులో ఉన్న‌ బొద్దింక‌ల గుంపును ఒక్క‌సారిగా చూడ‌డంతో భ‌యంతో పాటు షాక్‌కు గురైంది. నిజం బొద్దింకలు కాదు బొమ్మలే అయినా శిల్ప వాటిని చూసి ఎంత భయపడిందంటే.. వేదిక మీదినుంచి వెళ్లిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత తేరుకుంది. అనంత‌రం రియాల్టీ షోలో జ‌డ్జిగా మ‌ళ్లీ పాల్గొంది. అయితే, బాక్సులో ఉన్న‌వి నిజ‌మైన బొద్దింక‌లు కావ‌ని, బొద్దింక‌ల‌ బొమ్మలే అని షో నిర్వాహ‌కులు తాపీగా చెప్పడం విశేషం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments