Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకూ శత్రువులున్నారు : రామ్‌ లక్ష్మణ్‌ సెన్సేషనల్‌ కామెంట్‌

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (16:12 IST)
Ram Laxman
తెలుగు సినిమారంగంలో యాక్షన్‌ కొరియోగ్రాఫర్లుగా అన్నదమ్ములుగా వుంటూ పలు సినిమాలు చేస్తున్న రామ్‌ లక్ష్మణ్‌లు తాజాగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు పనిచేశారు. ఇద్దరు హీరోల సినిమాలకు భిన్నమైన కాన్సెప్ట్‌తో ఫైట్స్‌ చేశామని చెప్పారు. ఎన్నో సినిమాలు చేసిన వారి కెరీర్‌ సజావుగా సాగుతుంది అనుకుంటే పొరపాటే. చాలాసార్లు యాక్షన్‌ పార్ట్‌ షూట్‌ చేశాక, వారి చేసింది బాగోలేదని వారిని తీసివేసి వేరే యాక్షన్‌ మాస్టర్లను పెట్టుకున్న సందర్భాలు వున్నాయని వారు వెబ్ దునియాకు ప్రత్యేకంగా చెప్పారు.
 
ఒక్కో హీరోది ఒక్కో శైలి వుంటుంది. సినిమాకు కీలకం దర్శకుడు, హీరో, నిర్మాత. ఈ ముగ్గురు చెప్పినట్లే యాక్షన్‌ పార్ట్‌ చేయాలి. ఒకసారి రొటీన్‌గా అనిపించినా వారు ఓకే అంటే మేం చేయగలిగింది ఏమీలేదు. మహేష్‌బాబు సినిమా భరత్‌ అనే నేనుకు అలాంటిది ఓ సీన్‌ ఎదురైంది. రొటీన్‌ అయినా స్టయిలిస్‌గా వుండాలని చేయాల్సి వచ్చింది. అదేవిధంగా మాకు యాక్షన్‌ పార్ట్‌ చేసేటప్పుడే ఇది జనాలకు ఎక్కదు అని తెలుస్తుంది. అయినా ఒక్కోసారి రాజీపడాల్సివస్తుందని చెప్పారు. ఇక ఈ రంగంలో మాకూ శత్రువులు వున్నారు. దేవుడు అందరినీ ఒకేలా పుట్టించడు. ఏదో లోపం వుంటుంది. అలా వుంటేనే కాలం సాగుతుంది. మాకు కొత్తలో చాలామంది శత్రువులు వుండేవారు. కనిపించని శత్రువులు వారు. యాక్షన్‌ సీన్‌ కోసం అంతా స్టడీ చేశాక, ప్రాక్టీస్‌ చేశాక, ఒక్కోసారి షూటింగ్‌కు వచ్చాక కాన్సిల్‌ చేసేవారు. కొందరైతే కొంత పార్ట్‌ షూట్‌ అయ్యాక మమ్మల్ని మార్చేసేవారు అంటూ తమ మనోగతాన్ని వెబ్ దునియాకు వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments