Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

దేవీ
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (13:28 IST)
Rajendra Prasad, Ravi Teja
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, జాతీయ నటి అర్చన కాంబినేషన్ లో రూపేష్,ఆకాంక్ష సింగ్  హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి ‘. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మేస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా ఇటీవల విడుదల చేశారు.సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. 
 
రెండో పాటను ‘మాస్ మహారాజా’ రవితేజ ఆవిష్కరించి, యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ –“మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. డెఫినెట్ గా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు,ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్ “ అని చెప్పారు.
 
” ఇరు కనులు కనులు కలిసి మురిసె  మొదటి చూపులో ...అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ , విభావరి ఆలపించారు. ఆ విశేషాలను దర్శకుడు పవన్ ప్రభ తెలియజేస్తూ “సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’ లో ‘మౌనమేలనోయి ‘పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్ కి రెహమాన్ శరవేగంతో సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా గారు ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. ఎస్పీ చరణ్,విభావరితో ఈ పాట పాడించారు. అసలు ట్యూన్ వినగానే నాదీ, రూపేష్ మొహాలు వెలిగిపోయాయి. ఇక మొత్తం పాట రికార్డు అయ్యాక మా మొహాల్లో వెన్నెల కురిసినంత ఆనందం. అసలు ఈ పాట రికార్డింగ్ కూడా చాలా లవ్లీ గా ,లైవ్లీ గా జరిగింది. 
 
సింగర్స్ ఎవరిదారిన వాళ్ళు వచ్చి పాడి వెళ్లిపోకుండా ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఓ ఫీల్ తో ఈ డ్యూయట్ ని ఆలపించారు. కధలో సమ్మిళితమైన ఈ పాట, ఈ సినిమాకే కొత్త అందాన్ని,అనుభూతిని తీసుకొచ్చింది. ఈ పాట చిత్రీకరణని రాజమండ్రి లో ఈశ్వర్ నృత్య దర్శకత్వంలో తీశాం. మంచి ఎండల్లో అందరూ కస్టపడి,ఇష్టపడి ఈ పాట బాగా రావడానికి సహకరించారు. ముఖ్యంగా మా ఛాయాగ్రాహకుడు రామ్ రెడ్డి. మామూలుగానే గోదావరి అందంగా ఉంటుంది. ఇక తోట తరణి గారి కళా దర్శకత్వ నైపుణ్యం వల్ల ఈ పాటలో గోదావరి రెట్టింపు అందంతో కనిపిస్తుంది. మా హీరో హీరోయిన్లు రూపేష్,ఆకాంక్ష సింగ్ లపై  ఈ పాటను చిత్రీకరించాం” అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments