Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్.. ట్రైలర్ రిలీజ్ (video)

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:55 IST)
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో రూపొందిన మల్టీ స్టారర్ వార్ ట్రైలర్ ఇందాకా విడుదలైంది. సినిమా కథ గురించి అవుట్ లైన్ చెప్పేశారు. కబీర్(హృతిక్ రోషన్) ఒకప్పుడు భారత రక్షణ శాఖలో అత్యున్నత పదవిని అలంకరించి గొప్ప గుర్తింపు తెచ్చుకుని ఉంటాడు. కానీ ఏవో సంఘటనల వల్ల అందులో నుంచి బయటికి వచ్చి దేశ భద్రతకు ముప్పుగా మారతాడు. 
 
ఇతన్ని పట్టుకునే మిషన్ మీద కబీర్ దగ్గరే ఒకప్పుడు శిక్షణ తీసుకున్న ఖలీద్(టైగర్ ష్రాఫ్)ను రంగంలోకి దించుతారు. తనను పట్టుకోవడం కోసం వచ్చిన ఖలీద్‌కు కబీర్ పెద్ద సవాల్‌గా మారతాడు. ఇద్దరికీ భయంకరమైన ప్రమాదాలు ఎదురవుతాయి. మరి గురుశిష్యులు బద్ద శత్రువులుగా మారడానికి కారణాలు ఏమిటి, అసలు కబీర్ అలా ఎందుకయ్యాడు, ఖలీద్ చివరికి అతన్ని పట్టుకున్నాడా లేదా అనేదే వార్ కథ. 
 
ట్రైలర్‌లో సాంకేతిక విషయాలకు వస్తే మైండ్ బ్లోయింగ్ అని చెప్పక తప్పదు. విజువల్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌ని చిత్రీకరించిన తీరు ఈ మధ్యకాలంలో సాహో తర్వాత ఇదే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సిద్దార్థ్ ఆనంద్ టేకింగ్ ఇంకో లెవెల్‌లో ఉండగా బెంజమిన్ జాస్పర్ ఛాయాగ్రహణం హాలీవుడ్ స్టాండర్డ్‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంది. యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్‌లా అనిపిస్తున్న వార్‌ని సౌత్‌లోనూ డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్నారు.  
 
నిర్మాణ విలువల్లో ఏ మాత్రం రాజీ పడకుండా కోట్లాది రూపాయల బడ్జెట్‌తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన వార్, టైటిల్‌కు తగ్గట్టే అదిరిపోయే పోరాట దృశ్యాలతో కనువిందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న వార్ మీద అంచనాలు రెట్టింపు అయ్యేలా ట్రైలర్ కట్ చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments