Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. దేవకన్యలోనూ చాన్సు కొట్టేసిందిగా

వరుసగా మూడు హిట్ చిత్రాలతో జోరు మీదున్న టీనేజి్ హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా నాగ అన్వేష్ సరసన ఏంజెల్ సినిమాలో చాన్స్ కొట్టేసింది. నాగ అన్వేష్, హెబ్బా పటేల్‌ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్‌ పతాకంపై భువన్‌ సాగర్‌ నిర్మిస్తున్న సోషియో

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (07:52 IST)
వరుసగా మూడు హిట్ చిత్రాలతో జోరు మీదున్న టీనేజి్ హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా నాగ అన్వేష్ సరసన ఏంజెల్ సినిమాలో చాన్స్ కొట్టేసింది. నాగ అన్వేష్, హెబ్బా పటేల్‌ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్‌ పతాకంపై భువన్‌ సాగర్‌ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘ఏంజెల్‌’. గురువారం వీవీ వినాయక్‌ టీజర్‌ను విడుదల చేశారు.
 
‘‘తొమ్మిది నెలలు కథపై వర్క్‌ చేశాం. నాగ అన్వేష్‌ లుక్, గెటప్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. హెబ్బా పటేల్‌ బాగా నటించింది. ప్రతి సీన్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి. ‘‘వినాయక్‌గారు కథ విని బాగా సపోర్ట్‌ చేశారు. సప్తగిరి కామెడీ, భీమ్స్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు దర్శకుడు పళని. 
 
 ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ మాట్లాడుతూ.. దేవలోకం నుంచి వచ్చి సాధారణ యువకుడితో ప్రేమలో పడిన ఇతివృత్తంతో కూడిన ఏంజెల్ చిత్రం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. ‘‘దేవలోకం నుంచి వచ్చిన ఓ అమ్మాయి సాధారణ యువకుడితో ప్రేమలో ఎలా పడింది అనేది ఈ చిత్రకథ. ‘ఠాగూర్‌’ నుంచి నిర్మాత కృష్ణారెడ్డిగారితో పరిచయ ముంది. దర్శకుడు కథ చెప్పారు. కొన్ని సీన్స్‌ చూశా. చాలా కొత్తగా ఉంటుందీ సినిమా. నాగ అన్వేష్‌ బాగా హార్డ్‌వర్క్‌ చేస్తున్నాడు. తనకు హీరోగా మంచి భవిష్యత్‌ ఉంటుంది’’ అన్నారు.
 
భువన్‌ సాగర్, నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సంగీత దర్శకుడు భీమ్స్, హాస్యనటుడు సప్తగిరి, కథా రచయిత రమేష్‌ రెడ్డి, మాటల రచయిత శ్రీనివాస్‌ సంకల్ప్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ ముప్పా వెంకయ్యచౌదరి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

ఇస్రో కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్

ఐదుగురు మావోయిస్టులను చంపేసిన నక్సలైట్లు!

Coffee: ఉదయాన్నే కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments