Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిజిస్టర్ పెళ్లి.. రహస్యంగా కాపురం.. అత్తింటివారి వేధింపుల వల్లే... (video)

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (10:43 IST)
తమిళ బుల్లితెరకు చెందిన వీజే చిత్ర గత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. చెన్నై నగర శివారు ప్రాంతంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో ఆమె వెంట కాబోయే భర్త హేమనాథ్ కూడా ఉన్నారు. బుల్లితెరపై ఎంతో పాపులర్ నటిగా గుర్తింపు పొందిన చిత్ర ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు.. చిత్ర ప్రియుడు హేమనాథ్‌ను అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారణ జరిపారు. అంతేకాకుండా, చిత్ర మృతదేహానికి జరిగిన శవపరీక్షలో కూడా మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదనీ, ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయినట్టు తేల్చారు.
 
అంటే, గురువారం ఉదయం జరిగిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం ఆమె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పిమ్మట కోట్టూరుపురంలోని తండ్రి కామరాజ్‌ నివాసం వద్ద చిత్ర అంత్యక్రియలు జరిగాయి.
 
అయితే, తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఆత్మహత్యకు వేధింపులే కారణం అని ఆరోపిస్తున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని తల్లి బోరున విలపిస్తూ చెప్పింది. తన కుమార్తె రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకుని హేమనాథ్‌తో రహస్యంగా కాపురం చేసిందన్నారు. 
 
అత్తింటివారు వేధించడం వల్లనో, హేమనాథ్‌ పెట్టిన మానసిక వేధింపుల కారణంగానో చిత్ర ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులకు తాను ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇక చిత్రతో పాటు టీవీ సీరియల్స్‌లో నటించిన నటీనటులు చిత్ర చాలా ధైర్యస్థురాలని, ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణాలు వుండవచ్చని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments