Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం పేరు విశ్వంభర

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (19:23 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే 156వ చిత్రం పేరును ఆ చిత్రం నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను వెల్లడించారు. గతేడాది దసరా రోజు 'విశ్వానికి మించి..' అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. 
 
సోమవారం సంక్రాంతి సందర్భంగా దీని టైటిల్‌ను ప్రకటించారు. చిరు 156వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘విశ్వంభర’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్‌ వీడియోను పంచుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
వీడియో ఆధారంగా చూస్తే ఇదో  సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. ‘బింబిసార’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సినిమా కావడం.. మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కుతుండడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘మెగాస్టార్‌ స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్‌ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అంటూ అంచనాలను పెంచేశారు.
 
ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రూపొందుతోంది. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’పై 157వ సినిమా చేయనున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments