Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

డీవీ
సోమవారం, 16 డిశెంబరు 2024 (17:33 IST)
Vishwaksen
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ మూవీ 'లైలా'లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన 'లైలా' రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మేకర్స్ గతంలో లైలా ఐ లుక్ ని రిలీజ్ చేయగా విశ్వక్సేన్ క్యారెక్టర్ అందరినీ మెస్మరైజ్ చేసింది.
 
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున లైలా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ జానర్‌ లో వస్తున్న సినిమాకి లవ్ సీజన్‌ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం.
 
రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్ అవతార్, స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్‌ తో కనిపించారు. చొక్కాతో తన ముఖాన్ని దాచుకున్నట్లు ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. 2025 న్యూ ఇయర్ రోజున లైలా ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్)ని రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
విశ్వక్సేన్ ఈ చిత్రంలో అమ్మాయి పాత్రను పోషించడానికి బ్యూటీఫుల్ గా మేక్ఓవర్ అయ్యారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
లైలా విజువల్‌గా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా వుంటుంది. ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
 
త్వరలోనే ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మేకర్స్ ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

మోహన్ బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ వెల్లడి (Video)

జనసేనలోకి మంచు మనోజ్.. మౌనికా రెడ్డి!! (Video)

70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా పోతుంది : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలను ఎందుకు వదిలేశారు? ఇప్పుడేం చేస్తున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments