Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజ్ఇచ్చి ప్రపోజ్ చేస్తా సిద్ధంగా వుండండి అంటున్న విశ్వక్ సేన్ ‌

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (13:36 IST)
Vishwak Sen
ర‌వితేజ `ఇడియ‌ట్‌` అంటూ అప్ప‌ట్లో ముందుకు వ‌స్తే త‌ర్వాత ఉపేంద్ర `ఎ` అంటూ ప్ర‌త్యేక క‌థాంశాలు సైకో త‌ర‌హా పాత్ర‌ల‌తో కొంద‌మందిని ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా విశ్వక్ సేన్ `పాగ‌ల్‌`అంటూ ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌లో విడుద‌ల‌కానున్న ఈ సినిమాలో అమ్మాయిల‌కు పాగ‌ల్ అట‌. నిజ‌జీవితంలో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రినీ ప్రేమించ‌లేద‌ట‌. కాలేజీ డేస్‌లో వున్నా అప్పుడు భ‌యంగా వుండేద‌ట‌. అందుకే పాగల్ సినిమాలో 1600 మంది అమ్మాయిలను లవ్ చేశాను. అది కూడా సరిపోలేదు. అందుకే పాగల్ లవ్ యాత్రను ఏప్రిల్ 12 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ప్రాంతంలో చేపడతాం. ఎవరికి రోజ్ఇచ్చి ప్రపోజ్ చేస్తానో తెలియదు. అందరూ రెడీగా ఉండండి’ అని హీరో అన్నారు.
 
విశ్వక్ సేన్ న‌టించిన తాజా సినిమా `పాగ‌ల్‌`. ఏప్రిల్‌లో విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. గ‌తేడాది కరోనా వల్ల నాలుగు గోడల మధ్యజరుపుకున్నాను. ఇప్పుడు మీతో (అభిమానులు) జరుపుకుంటున్నాను. ఇకపై ప్రతీ రోజూ కనిపిస్తుంటాను. పాతికేళ్లు నిండి 26 ఏటలోకి వచ్చాను. రాబోయే రెండెళ్లలో దానికి డబుల్ ఉంటాయ్. మే1 నుంచి మీ డైలాగ్‌లు మారిపోతాయ్. ఈ నగరానికి ఏమైంది, హిట్, ఫలక్ నుమాదాస్ ఇలా ప్రతీ సినిమాలో ఓ డైలాగ్ పేలింది. మే1నుంచి కొత్త స్లోగన్ ఎక్కేస్తుంది. వేరే లెవెల్ ఉంటుంది. డౌటే లేదు థియేటర్లకు వచ్చేయండి. సినిమా మీద ఎంతో నమ్మకం ఉంది. డైరెక్టర్ నరేష్, నిర్మాతలు బెక్కెం వేణు గోపాల్, దిల్ రాజు అందరికీ థ్యాంక్స్. ఎక్కడా కూడా తప్పు చేయలేదు. సినిమా బాగా వచ్చింది. ఎవరితో ఎంత బెట్ వేసుకుంటారో వేసుకోండి. కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎల్లుండి నుంచి వారానికో పాట ఉంటుంది.. ఒక్కటి కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments