PCX ఫార్మాట్‌లో విశ్వక్ సేన్ 'గామి' షోరీల్ ట్రైలర్ రాబోతుంది

డీవీ
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (22:23 IST)
Vishwak Sen, Chandini Choudhary
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి' గ్రాండియర్ కి తగ్గట్టు, అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి బిగ్ స్క్రీన్‌ను ఎంపిక చేశారు మేకర్స్. ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు  అనౌన్స్ చేశారు. PCX ఫార్మాట్‌లో లాంచ్ చేసే మొట్టమొదటి ట్రైలర్ ఇదే.
 
'గామి' అనేది ఒక వ్యక్తి తన భయాన్ని జయించటానికి అసాధ్యమైన, అడ్వంచరస్ జర్నీ. గ్రాండ్ స్కేల్ లో సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. టీజర్, పాటలు సినిమా ప్రధాన కోర్ థీమ్ ఆవిష్కరించగా, ట్రైలర్ హీరో అద్భుతమైన ప్రయాణాన్ని చూపించబోతోంది. ట్రైలర్ పోస్టర్‌లో విశ్వక్ సేన్‌తో పాటు అఘోరాలు వారి చేతుల్లో టార్చ్‌లు పట్టుకుని ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తున్నారు.
 
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు  క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది.
 
హారిక పెడదా, మహమ్మద్ సమద్ ఇతర ప్రముఖ తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.
 గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments