Webdunia - Bharat's app for daily news and videos

Install App

''విశ్వక్ సేన్'' ఐడియా అదిరిందిగా.. అఖిల్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?

Webdunia
శనివారం, 18 జులై 2020 (18:04 IST)
Vishwak Sen
''విశ్వక్ సేన్'' వెళ్లిపోమాకే అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ వంటి చిత్రాలతో సూపర్ హిట్ కొట్టాడు. ఇంకా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా తమిళ సినిమా రీమేక్‌లో నటించాలని డిసైడ్ అయ్యాడు. అగ్ర నిర్మాత పివిపి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని అఖిల్‌తో చేయాలని అనుకున్నారు. 
 
కానీ అఖిల్ వద్దనడంతో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తక్కువ బడ్జెట్ లోనే ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్మాత పివిపి భావిస్తున్నారట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే డైలాగ్ రైటర్‌గా మాత్రం 'పెళ్ళి చూపులు' 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ అయితే బాగుంటుందని హీరో విశ్వక్ సేన్.. నిర్మాత పివిపికి సూచించాడట. 
 
ఇందుకు తరుణ్ భాస్కర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాకుండా డైలాగ్స్ రాయడం మొదలెట్టాడట. గతంలో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్‌లు 'ఈ నగరానికి ఏమైంది' 'ఫలక్ నుమా దాస్' వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అందుకే తరుణ్‌ను విశ్వక్ సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యడానికి కూడా తరుణ్ భాస్కర్ రెడీ అవుతున్నాడని టాక్ నడుస్తుంది. మరి విశ్వక్ సేన్ చేపట్టిన ప్రాజెక్టును అఖిల్ ఎందుకు వద్దనుకున్నాడోనని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments