Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియన్ చిత్రం శూన్యం చాప్టర్1 లో హీరో విశ్వ కార్తికేయ

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (16:40 IST)
Vishwa Karthikeya, Ayushi Patel
మన టాలీవుడ్ హీరో ఓ ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటించబోతున్నారు. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా దూసుకుపోతోన్న విశ్వ కార్తికేయ, కలియుగం పట్టణంలో సినిమాతో హిరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఆయుషీ పటేల్ హీరో హీరోయిన్లు గా ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటిస్తున్నారు.
 
టాలీవుడ్‌లో దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా విశ్వ కార్తికేయ నటించారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది సినిమాల్లో విశ్వ కనిపించాడు. రాజ శేఖర్ గోరింటాకు, రోహిత్ జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, శ్రీకాంత్ లేత మనసులు, మోహన్ బాబు శివ శంకర్, బాలయ్య బాబు అధినాయకుడు వంటి సినిమాల్లో విశ్వ నటించాడు.
 
జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో మంచి నటనను కనబరిచిన విశ్వ కార్తికేయ ప్రస్తుతం కలియుగం పట్టణంలో - సీకే గౌస్ మోదిన్ అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరు ఇద్దరు ఆఫర్ పట్టేశారు.
 
‘శూన్యం చాప్టర్ 1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రానుంది. ఇక ఈ ఇండోనేషియన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments