విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ దాస్ కా ధమ్కీ షూటింగ్ పూర్తి

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (15:02 IST)
Vishvak Sen
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత  నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. నేటితో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
 
ఇప్పటివరకూ విడుదలైన  'దాస్ కా ధమ్కీ' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.   ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల,  మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.  
 
వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teenmaar Mallanna: కొత్త పార్టీని ప్రారంభించిన తీన్మార్ మల్లన్న

ప్రతి ఒక్కరూ చక్కెర - ఉప్పు - నూనె తగ్గించుకోండి.. సీఎం చంద్రబాబు సూచన

ఫేక్ ప్రచారం.. వైకాపా నేత భూమనకు పోలీసుల నోటీసు

శబరిమల అభివృద్ధికి రూ.70.37 కోట్లు ఖర్చు చేశాం-వాసవన్ ప్రకటన

యూపీలో వింత ఘటన.. బావ చెల్లెలితో బావమరిది.. బావమరిది సోదరితో బావ జంప్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments