Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

దేవీ
బుధవారం, 4 జూన్ 2025 (20:47 IST)
Vishnu Manchu, Genelia
డైనమిక్ స్టార్ విష్ణు మంచు  హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రం ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్‌కు కాసుల వర్షం కురిసింది. విష్ణు మంచు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఢీ’ మూవీనీ జూన్ 6వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు.
 
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విష్ణు నుంచి వచ్చిన ఈ కామెడీ బ్లాక్ బస్టర్ సినిమాను మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారంలో థియేటర్లోకి ఢీ మూవీని మళ్లీ అందించబోతోన్నారు. అసలే ఇప్పుడు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో ఉన్నారు. విష్ణు ఈ కన్నప్ప చిత్రంతో సందడి చేసే కంటే ముందే మళ్లీ ‘ఢీ’తో మరోసారి అందరినీ మెప్పించనున్నారు. ‘కన్నప్ప’ చిత్రాన్ని జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments