Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌లో విష్ణు మంచు కన్నప్ప సెకండ్ షెడ్యూల్ షురూ

డీవీ
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (16:46 IST)
Kannappa second schedule,New Zealand
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ మేరకు చిత్రయూనిట్ న్యూజిలాండ్‌కు వెళ్లింది.  అక్కడ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్టుగా తెలిపారు. ఆల్రెడీ న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ను కంటిన్యూ చేశారన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక చిత్రయూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది.
 
ఈ మేరకు న్యూజిలాండ్‌లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు, విష్ణు మంచు కనిపిస్తున్నారు. ఈ రెండో షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కన్నప్ప సినిమాపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు.
 
న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments