Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (16:54 IST)
Preeti Mukundan
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మీద దేశ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ మరో ప్రకటన చేశారు. ఈ చిత్రంలో డైనమిక్ స్టార్ విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నారు. ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్రయూనిట్.
 
ప్రీతి నటించబోతున్న కీలక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించింది. విష్ణు మంచు, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్న ఈ కన్నప్ప మూవీతో ప్రీతి కెరీర్ లో మరో స్థాయికి వెళ్లనున్నారు.
 
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనున్నారు. ‘కన్నప్ప’లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.
 
దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..‘ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు. కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments