Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు మంచు సరసన ముచ్చటగా మూడోసారి బబ్లీ బ్యూటీ హన్సిక...

'దేనికైనా రెడీ', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది.

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (11:30 IST)
'దేనికైనా రెడీ', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. 'ఈడోరకం-ఆడోరకం' వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతున్న లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ 'లక్కున్నోడు'. 
 
తొలినాళ్ళ నుంచి విభిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న విష్ణు మంచుతో మా ఎం.వి.వి. సినిమా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'ఈడోరకం -ఆడోర‌కం' వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత విష్ణు నటిస్తున్న చిత్రమిది. గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుక‌ున్న రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో విష్ణుతో బబ్లీ బ్యూటీ హన్సిక నటిస్తుంది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు మాటలు, స్క్రీన్ ప్లే, పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, మ‌ధు ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారని చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ తెలిపారు. తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, స‌హ నిర్మాత‌లుః వి.ఎస్‌.ఎన్‌.కుమార్‌, విజ‌య్‌కుమార్ రెడ్డి, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments