విశాల్ చెల్లెలు ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయమైంది.. డిసెంబరులో నిశ్చితార్థం..
కోలీవుడ్ టాప్ హీరో విశాల్ ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయి. అయితే నడిగర్ సంఘం భవనంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకొంతకాలం వెనక్కి నెట్టేశారు. కానీ, ఈ పెళ్లి భాజాలు విశాల్ చెల్లెలకు వివాహం జరుగనుంది.
కోలీవుడ్ టాప్ హీరో విశాల్ ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయి. అయితే నడిగర్ సంఘం భవనంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకొంతకాలం వెనక్కి నెట్టేశారు. కానీ, ఈ పెళ్లి భాజాలు విశాల్ చెల్లెలకు వివాహం జరుగనుంది. విశాల్ చెల్లెలు ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయమైంది. వరుడు చెన్నైవాసే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరుగనుందని సమాచారం.
సింగపూర్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఐశ్వర్య, ప్రముఖ జ్యువెలరీ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన కృతిశ్ ఉమ్మిడిని వివాహం చేసుకోనున్నట్లు ఐశ్వర్య మరదలు శ్రేయా రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐశ్వర్య, కృతిశ్ లది లవ్ కమ్ అరేంజ్‌డ్ మ్యారేజ్ అని.. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.