Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌, తమన్నా జంటగా జి.హరి భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'ఒక్కడొచ్చాడు' టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రం కోసం ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో భారీ ఎత్తున క

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (20:19 IST)
మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'ఒక్కడొచ్చాడు' టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రం కోసం ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో భారీ ఎత్తున కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని చిత్రీకరించారు. ఈ ఛేజ్‌ 'ఒక్కడొచ్చాడు'కి ఓ హైలైట్‌ అవుతుంది.
 
పాండిచ్చేరిలో భారీ సెట్స్‌ వేసి దినేష్‌ నృత్యదర్శకత్వంలో హీరో విశాల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. అలాగే విశాల్‌, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్‌లో కోటి రూపాయల వ్యయంతో ఓ పాట తీశారు. హిప్‌ ఆప్‌ తమిళ్‌ సంగీతం అందించిన మరో బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌ 'ఒక్కడొచ్చాడు'.
 
రష్యాలో రెండు పాటలు 
నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మ్యూజిక్‌ అన్నీ మిక్స్‌ అయిన మంచి కమర్షియల్‌ ఫిలిం 'ఒక్కడొచ్చాడు'. విశాల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా ఇది. సెప్టెంబర్‌లో 10 రోజుల టాకీ పార్ట్‌ చెయ్యడంతో షూటింగ్‌ పూర్తవుతుంది. రష్యాలో రెండు పాటల్ని చిత్రీకరిస్తాం. ఆగస్ట్‌ 19న ఫస్ట్‌ లుక్‌. ఆగస్ట్‌ 29 విశాల్‌ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ చేస్తాం. అక్టోబర్‌ 9న ఆడియో, అక్టోబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌(రంగం ఫేమ్‌), మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: భాగ్యలక్ష్మి, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, సమర్పణ: ఎం.పురుషోత్తమ్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments