Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్మ‌యి, వైర‌ముత్తు వివాదంపై విశాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Vishal
Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:07 IST)
తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తుపై కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలు కోలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం అయ్యింది. చిన్మయి తనకు వైరముత్తుతో ఎదురైన చేదు అనుభవాలతో పాటు.. ఆయన బాధిత మహిళలు మరిందరి తరఫున గళం వినిపిస్తోంది. వాళ్లు చేసే ఆరోపణల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇంకా మరిందరు బాధితుల పక్షాన ఆమె పెద్ద ఉద్యమమే చేస్తోంది. 
 
ఐతే వైరముత్తుకు కోలీవుడ్లో మంచి పేరుంది. ఈ కార‌ణంతోనే అనుకుంట‌ా అక్కడి ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. చాలామంది మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో నడిగర్ సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఈ వివాదంపై స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 
 
అంతే కాకుండా... అందరిలో కదలిక తెచ్చే ప్రయత్నం చేశాడని చెప్ప‌చ్చు. ఇంత‌కీ విశాల్ ఏమ‌న్నాడంటే... చిన్మయితో పాటు ఇంకొందరు మహిళలు చేస్తున్న ఆరోపణల్ని తాను గౌరవిస్తానని.. ఐతే ఇలాంటి విషయాల్లో సినీ రంగంలోని మహిళలు వెంటనే స్పందించాలని కోరాడు. 
గతంలో అమలా పాల్ తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే వెంటనే తమను ఆశ్రయించిందని.. తగు చర్యలు చేపట్టామని చెప్పాడు. అలాగే మిగతా మహిళలు కూడా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తేవాలన్నాడు. ఇక వైరముత్తుపై వచ్చిన ఆరోపణల్ని పరిశీలిస్తున్నామని.. ఆయనపై నిషేధం విధించే విషయంపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని విశాల్ చెప్పాడు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది తేలాల్సి ఉందని విశాల్ చెప్పాడు. దీనిపై ఇండస్ట్రీ పెద్దలతో చర్చిస్తున్నట్లు విశాల్ తెలియ‌చేసాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments