Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందెంకోడి -3 తీస్తాం.. అందులోనూ కీర్తి సురేషే హీరోయిన్: విశాల్

15 ఏళ్ల క్రితం వచ్చిన "పందెంకోడి" సినిమాతోనే స్టార్ అయ్యాడు విశాల్. లింగుస్వామి తెర‌కెక్కించిన ఈ చిత్రం విశాల్ కెరీర్‌కు పునాదులు వేసింది. ప్రస్తుతం పందెంకోడి 2 సిద్ధం అవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌కు మంచ

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (17:22 IST)
15 ఏళ్ల క్రితం వచ్చిన "పందెంకోడి" సినిమాతోనే స్టార్ అయ్యాడు విశాల్. లింగుస్వామి తెర‌కెక్కించిన ఈ చిత్రం విశాల్ కెరీర్‌కు పునాదులు వేసింది. ప్రస్తుతం పందెంకోడి 2 సిద్ధం అవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి హైప్ వచ్చింది. అక్టోబ‌ర్ 18న విడుదల కానున్న ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీతో పాటు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. అవును.. నిజమే. పందెంకోడి-3కి రంగం సిద్ధమవుతోంది. ఈ విషయమై విశాల్ మాట్లాడుతూ.. ''కెరియర్ ఆరంభంలో లింగుస్వామి దర్శకత్వంలో 'పందెం కోడి' చేసిన తాను, మళ్లీ 25వ సినిమాగా ఈ సీక్వెల్ చేయడం విశేషం. ఈ సినిమాలో తనకు జోడీగా కీర్తీ సురేష్ కనిపిస్తుందని స్పష్టం చేశారు. 
 
పందెంకోడి సీక్వెల్‌లో కీర్తి సురేష్ యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసిందని.. నటనాపరంగా అద్భుతంగా చేసిందని.. అందుకే పందెంకోడి-3లోనూ ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వనున్నట్లు విశాల్ ప్రకటించారు. ఇక పందెంకోడి -2లో వరలక్ష్మి నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని.. ఈ సినిమా తన ఖాతాలో మరో హిట్‌ను సంపాదించిపెడుతుందని విశాల్ నమ్మకం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ మొదటి మహిళా డ్రైవర్‌గా సరితను నియమించిన టీఎస్సార్టీసీ

ఏపీ విద్యా నమూనాను ప్రపంచానికి ఉదాహరణ మార్చాలి.. నారా లోకేష్ పిలుపు

2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం

Heavy Rains : హైదరాబాద్ వాసులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి.. పోలీసులు

ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments