Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు భాష‌ల్లో డిజిటల్ క్రైమ్ క‌థ‌తో విశాల్ `చ‌క్ర`‌

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (17:14 IST)
Visal, Sradha Srinadth, Chakra
యాక్ష‌న్ హీరో విశాల్ స‌రికొత్త ప్ర‌యోగాలు చేస్తుంటాడు. 2018లో డిజిట‌ల్ క్రైమ్ నేప‌థ్యంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్‌తో `అభిమ‌న్యుడు` చేశాడు. అది యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంది. తాజాగా మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు విశాల్‌. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు.
 
ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు,త‌మిళ‌,మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాషల్లో  విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా యాక్ష‌న్ హీరో విశాల్ మాట్లాడుతూ - ``ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `చ‌క్ర` చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న నాలుగు సౌత్ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.  ఇంకా ఈ సినిమాలో మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి.బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments