Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్జిన్ స్టోరి యూత్ కు బాగా నచ్చుతోంది - లగడపాటి శ్రీధర్

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:35 IST)
Virgin Story team
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన `వర్జిన్ స్టోరి` శుక్ర‌వార‌మే విడుద‌లైంది. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌమిక పాండియన్ నాయికగా నటించింది. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం తెలిపారు. శ‌నివారం హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో ఒక కొత్త ప్రయత్నం చేశామని అభినందిస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యత చూపించలేదు అని ప్రశంసిస్తున్నారు. యూఎస్ నుంచి మిత్రులు కాల్ చేసి అభినందిస్తున్నారు. టీనేజ్ లో ఉన్న వాళ్లకు మా సినిమా కంటెంట్ బాగా అర్థమవుతుంది. సినిమాకు విజయాన్ని
అందించి మమ్మల్ని మా టీమ్ ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు. అన్నారు.
 
దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ...క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేశాం. యూత్ నుంచి రెస్పాన్స్ బాగుంది. కామెడీలో చాలా రకాలు ఉంటాయి. మేము విభిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ ఇద్దామని ప్రయత్నించాం. మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియెన్స్ నుంచి ఇంకా మంచి స్పందన ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం అన్నారు.
 
నాయిక సౌమిక పాండియన్ మాట్లాడుతూ...నేను పియూ అనే పాత్రలో నటించగలను అని నమ్మిన దర్శకుడు ప్రదీప్ గారికి థాంక్స్. థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. కానీ కొన్ని సీన్స్ పూర్తయ్యాక నేను బాగానే నటించానని నమ్మకం
కలిగింది. కొత్త ప్రయత్నం చేసిన మా చిత్రాన్ని ఆదరించండి. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments