Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ విజయం సాధించబోతోంది: నవీన్ చంద్ర

దేవీ
గురువారం, 19 జూన్ 2025 (16:37 IST)
Naveen Chandra, Krishna Poluru, Abhigya Vootaluru, Charan Lakkaraju
‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు.
 
నవీన్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. రెక్కీ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు. అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ ట్రైలర్‌లో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ని కూడా టచ్ చేసినట్టు కనిపిస్తోంది. జూన్ 27న జీ5లోకి రాబోతోన్న ఈ సిరీస్‌తో టీంకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘మా సిరీస్ ట్రైలర్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర గారికి థాంక్స్. టీం అంతా కలిసి మంచి సక్సెస్ ఇవ్వబోతోన్నారు. అను గారు నా మీద నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. రెక్కీ తరువాత పదిహేను కథలు విన్నాను. కానీ ఏ సబ్జెక్ట్ కూడా నచ్చలేదు. కానీ దివ్య గారి ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ కథ జీ5 వద్దకు వచ్చింది. అను మేడం గారు నన్ను రిఫర్ చేశారు. దివ్య గారు చెప్పిన నెరేషన్ విన్న తరువాత నన్ను ఆ కథ నన్ను చాలా వెంటాడింది. అభిజ్ఞ సైతం ఈ కథ విన్న తరువాత చాలా ఎగ్జైట్ అయ్యారు. కృష్ణ గారు కూడా ముందు ఈ ప్రాజెక్ట్‌లో లేరు. కానీ నా మాట కోసం కృష్ణ గారు వచ్చి డైరెక్షన్ చేశారు. నా ఫ్రెండ్ ప్రవీణ్ ఈ ప్రాజెక్ట్ కోసం అన్నీ తానై  పని చేశారు. 80వ వాతావరణాన్ని చూపేందుకు ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర, క్యాస్టూడ్ డిజైనర్ అంజలి చాలా కష్టపడ్డారు.
 
డైరెక్టర్ కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘నేను జీ5లో ఇది వరకు ‘రెక్కీ’ చేశాను. అద్భుతమైన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ చేశాను. ఈ ప్రాజెక్ట్‌కి దివ్య గారు కథను అందించారు. రెక్కీలానే ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
 
హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత మంచి కథను రాసిన దివ్య గారికి థాంక్స్. మూఢ నమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఈ కథను నాకు శ్రీరామ్ గారు చెప్పారు. అద్భుతమైన కథ అని నాకు అప్పుడే అర్థమైంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు కృష్ణ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి కథల్ని ఎంకరేజ్ చేస్తున్న జీ5 టీంకు థాంక్స్. జూన్ 27న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments