Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుకుంటే ప్రతి రోజూ వాలెంటైన్ డేనే: అనుష్కకు కోహ్లీ ట్వీట్

ఇన్నాళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య సంబంధం అధికారికంగానే బహర్గతమైంది. ప్రేమపక్షులుగా చాలా కాలంగా దోబూచులాడుతున్న ఈ జంట డేటింగ్ గురించి మీడియా చిలవలు పలువలుగా రాస్తూనే ఉంది. ఇన్నాళ్లకు ప్ర

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (07:21 IST)
ఇన్నాళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య సంబంధం అధికారికంగానే బహర్గతమైంది. ప్రేమపక్షులుగా చాలా కాలంగా దోబూచులాడుతున్న ఈ జంట డేటింగ్ గురించి మీడియా చిలవలు పలువలుగా రాస్తూనే ఉంది. ఇన్నాళ్లకు ప్రేమికులదినం సాక్షిగా విరాట్ కోహ్లీ తన సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా తన ప్రేమికురాలికి తన ప్రేమ, ఆరాధన గురించి తెలియజేశాడు. ఒక పచ్చిక మైదానంలో మామూలుగా తామిద్దరూ కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేసిన కోహ్లీ అద్భుతమైన సందేశాన్నే పంపాడు.
 
నీవు కోరుకున్నట్లయితే ప్రతి రోజు వాలెంటైన్ డే లాగే ఉంటుంది. నాకోసం ప్రతి రోజును ఒక ప్రేమికుల దినంగా మారుస్తావు. అంటూ కోహ్లీ అనుష్కను ఉద్దేశించి సున్నింతంగా, సుతారంగా ట్వీట్ చేశాడు. కాని ఇంత సున్నిత ప్రకటనను కూడా కోహ్లీ ఏ కారణం వల్లో తొలగించేశాడు. 
 
ఆధునిక క్రికెట్‌ చరిత్రలో నిరుపమాన క్రీడాకారుడిగా యావత్ క్రీడాలోకం ప్రశంసలు అందుకుంటున్న కోహ్లీ ఇటీవలే తన ఫ్యాన్స్‌తో ఒక ఊహాత్మక గేమ్ అడాడు. ఎప్పటికీ అనే రహస్యం సందేశం కల ట్వీట్‌ను అతను పంపడంతో అదేమై ఉంటుందా అని ఫ్యాన్స్ జుత్తు పీక్కున్నారు. ఆ ట్వీట్‌లో అతడిలా రాశాడు. ప్రపంచానికి నీవు ఏదైనా చెప్పాలనుకుంటావు. కానీ నీవు చెప్పలేదు#Forever అంటూ కోహ్లీ ఆ ట్వీట్ ముగించాడు. 
 
దీని భావమేమి తిరుమలేశా అంటే మీకు మీరు ఊహించుకోవలిసిందే ఇక...

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments