రాఖీని రికార్డ్స్ ఇష్టపడతాయి.. కేజీఎఫ్ చాప్టర్-2 ట్రైలర్‌ రికార్డ్స్ అదుర్స్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (14:21 IST)
KGF: Chapter 2
కేజీఎఫ్ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో అత్యధికంగా వ్యూస్‌ను సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన చాప్టర్-2 ట్రైలర్ కూడా టీజర్ తరహాలోనే యూట్యుబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది.
 
24 గంటల్లోనే 109 మిలియన్ల వ్యూస్ సాధించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ తో మరో రికార్డును బద్దలు కొట్టింది. ఆదివారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ 24గంటల్లో 109 మిలియన్ల వ్యూస్‌ను సాధించి యూట్యుబ్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది. 
 
ఇండియాలోనే ఇంత ఫాస్ట్‌గా అత్యధిక వ్యూస్‌ను సాధించిన ట్రైలర్‌గా చాప్టర్‌-2 ట్రైలర్ రికార్డు సృష్టించింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర మేకర్స్ సోషల్ మీడియాలో "రికార్డ్స్..రికార్డ్స్..రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టముండదు. కానీ రాఖీని రికార్డ్స్ ఇష్టపడతాయి" అంటూ మేకర్స్ సినిమాలోని డైలాగ్‌తో రికార్డ్స్‌ను వర్ణించారు. 
 
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హొంబలే సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.
 
ఇంకా దర్శకుడు ప్రశాంత్ యష్ చేత చెప్పించిన పంచ్ డైలాగ్స్ అదిరాయి. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏఏ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నార్త్ ఇండియన్ మార్కెట్లలో విడుదల చేస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments