Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద కోట్ల ఓటీటీ ఆఫ‌ర్ ను వ‌ద్ద‌న్న విక్రాంత్ రోణ

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (18:03 IST)
Vikrant Rona
కన్న‌డ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌తో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చిన  ఈ త్రీ డీ సినిమాను ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌ముఖ OTT సంస్థ ‘విక్రాంత్ రోణ‌’కు ఫ్యాన్సీ డీల్ ఆఫర్ చేసింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చాలా వరకు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ విక్రాంత్ రోణ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయడానికి ఫ్యాన్సీ రేటు ఆఫ‌ర్ చేసింద‌ట‌. ఏకంగా రూ.100 కోట్లు ఫ్యాన్సీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ‘విక్రాంత్ రోణ‌’ మేక‌ర్స్ సింపుల్‌గా నో చెప్పేశారు. 
 
భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ‘విక్రాంత్ రోణ‌’ రూపొందుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్న ఈ సినిమాను అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మాతలు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫాలో విడుద‌ల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నిర్మాత‌ల‌కు ఈ క్రేజీ ఆఫ‌ర్‌ను ఇచ్చింది. 
 
విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ప్ర‌తినిధుల‌కు ‘విక్రాంత్ రోణ‌’ మేక‌ర్స్ స్పెష‌ల్ షో ప్ర‌ద‌ర్శించారు. హాలీవుడ్ రేంజ్‌లో విజువ‌ల్స్ ఉన్నాయ‌ని, ఇండియ‌న్ సినిమాలో ఇలాంటి మూవీ రాలేద‌ని ఓటీటీ ప్ర‌తినిధులు ‘విక్రాంత్ రోణ‌’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కితాబిచ్చార‌ట‌. అదే స‌మ‌యంలో కిచ్చా సుదీప్ పెర్ఫామెన్స్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంద‌ని కూడా వారు అభినందించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంంలోనే ఫ్యాన్సీ డీల్ ఆఫ‌ర్ చేశార‌ట స‌ద‌రు ఓటీటీ ప్ర‌తినిధులు. కానీ ‘విక్రాంత్ రోణ‌’ మేక‌ర్స్ వారి ఆఫ‌ర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. 
 
ఈ విష‌యంపై ‘విక్రాంత్ రోణ‌’నిర్మాత జాక్ మంజునాథ్ అడిగితే ఆయన స్పందిస్తూ.. ‘‘నిజమే! మా ‘విక్రాంత్ రోణ‌’ చిత్రానికి ఓటీటీ సంస్థ నుంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాలి. ముఖ్యంగా కొన్ని స‌న్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌, చిన్న పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త్రీడీలో ప్ర‌త్యేకంగా రూపొందించాం. క‌చ్చితంగా త్రీడీ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ప్రేక్ష‌కుల‌ను స‌రికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. 
 
దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘నిజానికి మా సినిమాను చూసి ఓటీటీ సంస్థ అంత పెద్ద ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విష‌యం. అయితే ప్రేక్ష‌కుకుల ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌డానిక‌నే త్రీడీలో ‘విక్రాంత్ రోణ‌’ను రూపొందిస్తున్నాం. సినిమా బిగ్ స్క్రీప్‌పై చూస్తే వ‌చ్చే ఫీలింగ్ మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌ని చెప్ప‌గ‌లం. కాబ‌ట్టి మేం కూడా అలాగే భావిస్తున్నాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments