Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్రమ్ కొత్త చిత్రం 'ఇంకొక్కడు'.. మరో ప్రయోగాత్మక యాక్షన్ థ్రిల్లర్!

'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'నాన్న', 'ఐ' వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ప్రయోగాత్మక యాక్షన్ థ్రిల్లర్ 'ఇంకొక్క

Webdunia
గురువారం, 28 జులై 2016 (17:17 IST)
'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'నాన్న', 'ఐ' వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ప్రయోగాత్మక యాక్షన్ థ్రిల్లర్ 'ఇంకొక్కడు'. నయనతార, నిత్యామీన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం 'ఇరుముగన్'. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్‌పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి 'ఇంకొక్కడు' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.
 
విజయ్‌తో పులి వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శిబుథమీన్స్, విక్రమ్ ప్రభుతో 'అరిమనంబి' వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో 'ఇంకొక్కడు' చిత్రం రూపొందుతోంది. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో నిర్మాత నీలం కృష్ణారెడ్డి ఫ్యాన్సీ ఆఫర్‌తో తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు క్వాలిటీతో కూడుకున్న చిత్రాలను అందించడమే మా బ్యానర్ లక్ష్యం. శిబుథమీన్స్, ఆనంద్ శంకర్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్, హైటెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. 
 
విక్రమ్, నయనతార, నిత్యామీనన్ వంటి టాప్ స్టార్స్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్‌గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్‌గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్‌గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. తమిళంలో ఆగస్టు 2వ తేదీన చెన్నైలో ఆడియో విడుదల కానుంది. త్వరలోనే తెలుగులో ఆడియో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. 

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments