Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తలైవి''గా మణికర్ణిక.. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్.. సినిమా హిట్టేనా?

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (13:07 IST)
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో సంచలన సినిమాను సిద్ధం చేసే పనిలో వున్నారు. తమిళనాట అమ్మగా పేరు తెచ్చుకున్న పురట్చితలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు ఎల్ విజయ్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తోంది. విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో వున్నాడు. 
 
జయలలిత సాధారణ స్థాయి నుంచి అసాధారణ మహిళగా ఎలా ఎదిగిందనే కోణంలో కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను ''తలైవి'' అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మణికర్ణిక వంటి హిస్టారికల్ మూవీ తర్వాత కంగనా రనౌత్ నటిస్తోన్న బయోపిక్ ఇదే కావడం గమనార్హం. 
 
ఇక ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని సినీ జనం అనుకుంటున్నారు. కాగా బాహుబలి, భజరంగి భాయ్ జాన్ సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
ఈ రెండు సినిమాల ద్వారా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో కంగనా చేసిన మణికర్ణికా సినిమాకు కథను అందించాడు. తాజాగా తలైవి కూడా ఆతనే కథను అందించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments