Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను నా దిల్ సే నువ్వే అంటున్న విజయ్ దేవరకొండ

Webdunia
మంగళవారం, 9 మే 2023 (15:36 IST)
Vijay Devarakonda, Samantha
విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వాటిని రెట్టింపు చేసేలా విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ సాంగ్ కనిపిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు.
 
ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ విశేషమైతే.. '' నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే" అంటూ పాట మొత్తంలో   లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. 'నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. ", నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. " అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది.
ఏ సినిమా నుంచి అయినా మొదటి పాట వస్తోందంటే అది ఆ మూవీ ఫ్లేవర్ ను తెలియజేస్తుంది. ఖుషీ నుంచి వచ్చిన ఈ గీతం కూడా ఓ ప్లెజెంట్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అనేలా కనిపిస్తోంది. శివ నిర్వాణే నృత్యరీతులు సమకూర్చిన ఈ గీతాన్ని కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించారు.
 
సమంత ఓ కశ్మీరి యువతిగా కనిపిస్తోంది. తన ప్రేమను గెలుచుకునే యువకుడుగా విజయ్ నటించాడు. వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని పాట చూస్తే అర్థమౌతోంది. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన ఖుషీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments