Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 4న రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" టీజర్

ఠాగూర్
ఆదివారం, 3 మార్చి 2024 (11:08 IST)
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను రేపు మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. "ఫ్యామిలీ స్టార్" టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. 
 
"ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసువర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్‌ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా సూపర్ హిట్ కానుందనే ఇండికేషన్స్ ఇస్తున్నాయి.
 
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments