Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండతో బెడ్ షేర్ చేసుకునేది ఎవరు?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (11:58 IST)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనన్యా పాండే హీరోయిన్. అయితే, విజయ్ దేవరకొండ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. దానికి తనతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరు, గెస్ చేయండి అంటూ క్యాష్షన్ పెట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
మరోవైపు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం "పుష్పక విమానం". ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వర్క్ తన భూజాలపై వేసుకున్నాడు. 
 
గత కొద్ది రోజులుగా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే కాస్త డిఫరెంట్‏గా బెడ్ రూమ్ వీడియో ప్లాన్ చేసి ఆసక్తి కలిగించారు. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా.. దేవరకొండ బ్రదర్స్ విశాఖపట్నంలోని ఒక హోటల్‏లో బస చేశారు. ఈ క్రమంలోనే తమ్ముడితో కలిసి బెడ్పై నిద్రిస్తున్న విజయ్… మధ్యలో లేచి.. తమ్ముడిని సుందర్ అని పిలుస్తూ నిద్ర లేపాడు.. 
 
నువ్వు ఇక్కడ ఉన్నావేంటిరా? నీ పెళ్లాం ఏది? అంటూ పలుమార్లు ఆనంద్ దేవరకొండను విసిగించాడు. దీంతో నా పెళ్లాం లేచిపోయిందిరా అని చెప్పి మళ్లీ ముసుగు పెట్టుకుని పడుకున్నారు. ఈ ఫన్నీ వీడియోను విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ తెగ వైరల్ అవుతుంది. దేవరకొండ ప్రమోషన్స్ వీర లెవల్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments