Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఏ మంత్రం వేసావె'' అంటోన్న అర్జున్ రెడ్డి... శివానీ హీరోయిన్?

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన విజయ్ దేవర కొండ తాజాగా మైత్రీ మూవీస్ పతాకంపై ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో అరడజనుకు పైగా

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:11 IST)
పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన విజయ్ దేవర కొండ తాజాగా మైత్రీ మూవీస్ పతాకంపై ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. అందులో మైత్రీ మూవీస్ ప్రాజెక్టు జనవరిలో సెట్స్ పైకి వెళుతోంది. ఇప్పటికే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. 
 
మరోవైపు అర్జున్‌రెడ్డి చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకొన్న విజయ్‌ దేవరకొండ, తాజాగా మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని నిర్మాతలు అంటున్నారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ''ఏ మంత్రం వేసావె'' సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. శ్రీధర్‌ మర్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో విజయ్‌ పడుకుని దీనంగా ఆలోచించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక విజయ్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మాణంలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వస్తున్న మహానటి చిత్రంలోనూ అర్జున్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇందులో ప్రముఖ నటుడు రాజశేఖర్ తనయ శివానీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments