Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీకు మాత్రమే చెప్తా'నంటున్న విజయ్ దేవరకొండ

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (18:19 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాను నిర్మిస్తున్న మొదటి సినిమా 'మీకు మాత్రమే చెప్తా' టైటిల్‌ని అలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. 'పెళ్లి చూపులు' సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడట. 
 
లూక్‌లో తరుణ్‌తో పాటు మరో ఇద్దరు ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్లు ఎక్స్‌ప్రేషన్ పెట్టారు. ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉంది. పోస్టర్‌ పైన మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్ అనే క్యాప్షన్ రాసి ఉంది. దానిని చూస్తుంటే సినిమా ఆ ముగ్గురి జీవితాల్లోని రహస్యాల నేపథ్యంలో ఫన్నీగా ఉండేలా ఉంది. 
 
ఇది ఎలా ఉన్నా ఇప్పటి దాకా హీరో రోల్ పోషించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మంచి నిర్మాతగా కూడా నిరూపించుకోబోతున్నారు. ఇక సినిమా ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్పనవసరం లేదు. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 
 
అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం లేదని తెలుస్తోంది. కానీ ఆయన అతిథి పాత్రలో కనిపించవచ్చని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు నటీనటులు తాము నిర్మించే సినిమాల్లో తామే నటిస్తున్నారు. మరి విజయ్ ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతారా లేక కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టి ఊరుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments