Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరితో సినిమా లేద‌న్నావ్.. ఇప్పుడేమంటావ్ విజ‌య్..?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (21:11 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇదే విష‌యం గురించి విజ‌య్‌ని అడిగితే... పూరితో సినిమానా..? అబ్బే అలాంటిది ఏం లేదే..? అని చెప్పాడు డియ‌ర్ కామ్రేడ్ ప్ర‌మోష‌న్స్‌లో. క‌ట్ చేస్తే... డియ‌ర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయ్యింది. రెండుమూడు రోజులు గ‌డిచాయ్. అంతే... పూరితో విజ‌య్ సినిమా క‌న్ఫ‌ర్మ్ అంటూ వార్త‌లు. 
 
అంతేకాకుండా... అఫిషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. పూరితో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల మిగిలిన వివ‌రాల‌ను తెలియ‌చేస్తాం అన్నారు. హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఖ‌రారు కాలేద‌ని తెలిసింది. ర‌ష్మిక‌ను తీసుకుందామా..? కొత్త అమ్మాయిని తీసుకుందామా..? అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. 
 
రెండుమూడు రోజుల్లో పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేయ‌గానే అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి... ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments