Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్ రెడ్డి' దూకుడుకి బ్రేకులు వేసిన "నోటా".. బ్యాడ్ టైమ్ ప్రారంభమైందా?

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:33 IST)
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో కెరటంలా దూసుకొచ్చిన యువ హీరో.. "గీత గోవిందం" చిత్రంతో టాప్ స్టార్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నటించిన చిత్రం "నోటా". ఈ చిత్రం ఈనెల 5వ తేదీన విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆయనకు బ్యాడ్ టైమ్ ప్రారంభమైందనే టాక్ వినిపిస్తోంది.
 
వరుసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ దూసుకపోతున్న విజయ్‌కు 'నోటా' బ్రేక్ వేసిందన్న ప్రచారం సాగుతోంది. నిజానికి 'పెళ్లి చూపులు' సినిమాతో ఆకట్టుకున్న ఈ నటుడు "అర్జున్ రెడ్డి"తో యూత్‌లో ఒక ఐకాన్‌గా మారిపోయాడు. అనంతరం వచ్చిన "గీత‌ గోవిందం"తో అందరి వాడిగా మారిపోయాడు. ఇలా ఏ సినిమా చేసినా వైవిధ్యం కనబరుస్తూ అలరిస్తున్నాడు. ఇతర సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. 'ట్యాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో విజయ్ నటిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' శుక్రవారం రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం రూపొందింది. చిత్రం విడుదలకాకముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందడంతో అభిమానుల్లో ఉత్కంఠనెలకొంది. కానీ సినిమా రిలీజైన అనంతరం భిన్నమైన టాక్ వినిపిస్తోంది. చిత్రానికి ఎదురుగాలి వీస్తోందని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? పెడితే దానికి సంబంధించిన అంశం ఉండాలి కదా అని ప్రేక్ష‌కులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి విజయ్‌కు ఇప్పటి నుండి అసలైన టైం ప్రారంభమైందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments