Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ స్థాయిలో ఉండటానికి కారణం తమ్ముడే: విజయ్ దేవరకొండ కంటతడి

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:39 IST)
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ ‘దొరసాని’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ తన తమ్ముడి గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు మరో ముఖ్య అతిథిగా రాజశేఖర్‌ కూడా నటించారు. 
 
అమెరికా దేశంలోని డెలాయిట్‌లో ఆనంద్‌ పని చేసేవాడు. సినిమాల్లో నటించాలనే కోరిక తనకు ఉన్నట్లు, అందుకోసం ఇండియాకు వచ్చేస్తానని చెప్పడం నాకు వచ్చలేదు. అందుకే మంచి కథలను ఎంచుకునే సామర్థ్యం వాడికి రావాలనే ఉద్దేశ్యంతో సినిమాలలోకి వస్తే నా సాయం లేకుండా ఒంటరిగా కష్టపడాలని చెప్పాను. 
 
ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ నాకు డబ్బు పంపడం వల్లనే నాకు సాధ్యమైంది. ఇక ఆనంద్‌ సినిమా గురించి నన్ను ఎవరైనా అడిగితే నాకేమీ తెలీదని చెప్పేవాడిని, వాడి సినిమా పూజ కార్యక్రమానికి కూడా నేను రాలేకపోయాను. 
 
నెటిజన్ల నుండి వచ్చే ట్రోలింగ్‌‌ను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆనంద్‌ సినిమా కోసం ప్రచారం చేయలేదు. ‘దొరసాని’ సినిమా చూశాను. చాలా బాగుంది. దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం, అలాగే శివాత్మిక, ఆనంద్‌ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు’ అంటూ కంటతడి పెట్టారు విజయ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments