మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు చిక్కుల్లో పడ్డారు. నటి అత్యాచార కేసు మెడకు చుట్టుకుంది. కోర్టులో అతడు పెట్టిన ముందస్తు బెయిల్ పిటిషన్‍ను న్యాయస్థానం కొట్టిపారేసింది.
దీంతో అతను ఖచ్చితంగా కోర్టులో హాజరు కాక తప్పని పరిస్థితి. ఒకవేళ హాజరు కానీ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ప్రస్తుతం విజయ్ బాబు దుబాయ్‌లో వున్నారని కోర్టుకు హాజరుకాలేకపోయాడని అతని తరుపు న్యాయవాది చెప్పినా న్యాయస్థానం వెంటనే అతడిని కొచ్చికి వచ్చి కోర్టులో హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసింది.
దీంతో విజయ బాబు బుధవారం కొచ్చిలొకి దిగుతాడని, వెంటనే అక్కడినుంచి కోర్టులో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మే 30న కేరళకు తిరిగి రాకుంటే అతని పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోబోమని ఇప్పటికే స్పష్టం చేసిన కోర్టు బుధవారం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ సాగుతోంది.
కోజికోడ్ కు చెందిన నటి ఏప్రిల్ 22న కొచ్చిలోని ఒక ఫ్లాట్ లో ప్రముఖ నటుడు నిర్మాత విజయ్ బాబు తనపై అత్యాచారం చేశాడని నటి ఎర్నాకులంలోని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అవకాశం ఇస్తానని చెప్పి తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, తనను లైంగికంగా వేధించే ముందు తనకు మత్తు పదార్థాలు ఇచ్చాడని కూడా ఆమె ఆరోపించింది.