విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

డీవీ
శుక్రవారం, 21 జూన్ 2024 (19:07 IST)
Vijay Antony
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు "తుఫాన్" సెకండ్ సింగిల్ 'వెతికా నేనే నా జాడే' రిలీజ్ చేశారు.
 
'వెతికా నేనే నా జాడే' పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ' వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ' అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగుతుందీ పాట. "తుఫాన్" సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
 
నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా కోచ్‌లో ప్రయాణం చేస్తున్న మహిళపై అత్యాచారం, దోపిడి.. కత్తితో బెదిరించి..?

ఆయన మారడు...సో... నేను లేనపుడు నాతో వచ్చిన వారు.. నాతోనే పోతారు.... మహిళ సెల్ఫీ వీడియో

తెలంగాణ ఆర్థిక వృద్ధికి తోడ్పడిన జీఎస్టీ తగ్గింపు.. ఎలాగంటే?

ప్రధాని మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. కర్నూలులోనే మకాం వేసిన ఏపీ కేబినెట్

ఒక్కసారిగా వేడెక్కిన జూబ్లీహిల్స్ ఉప పోరు : గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments