Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

దేవి
బుధవారం, 12 మార్చి 2025 (19:25 IST)
Badrakali
హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం ‘భద్రకాళి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. 
 
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా భద్రకాళి సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్దం, అహంకారం అంతం అవును’.. అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఫ్యామిలీ మెన్‌లా కనిపిస్తున్నారు.. మరోసారి గ్యాంగ్ స్టర్‌లా అనిపిస్తున్నారు.. ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు.. అసలు ఈ కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్‌ను కట్ చేశారు. 
 
190 కోట్ల కుంభకోణం చుట్టూ కథ తిరిగేలా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చిన డైలాగ్‌తో టీజర్ మీద మరింత ఆసక్తిని పెంచేసినట్టు అయింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలీష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. 
 
ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ షెల్లీ కాలిస్ట్ విజువల్స్ ఈ టీజర్‌లో అద్భుతంగా అనిపిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ ఆర్ఆర్, రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్, రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ టీజర్‌లో హైలెట్ అవుతున్నాయి.
 
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ భద్రకాళి సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
 
తారాగణం: విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మరియు మాస్టర్ కేశవ్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ 
నిర్మాత: విజయ్ ఆంటోని
సమర్పణ: మీరా విజయ్ ఆంటోని
రచయిత-దర్శకుడు: అరుణ్ ప్రభు
సినిమాటోగ్రఫీ: షెల్లీ కాలిస్ట్
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఎడిటింగ్: రేమండ్ డెరిక్ క్రాస్టా
యాక్షన్ కొరియోగ్రఫీ: రాజశేఖర్
పీఆర్వో : సాయి సతీష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments