Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజు రోజు పెరుగుతున్న విజయ్ ఆంటోనీ లవ్ గురు ఆదరణ

డీవీ
శనివారం, 13 ఏప్రియల్ 2024 (19:00 IST)
Vijay Antony, Mrinalini Ravi
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "లవ్ గురు" ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న రిలీజ్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది. "లవ్ గురు" సినిమా ప్రీమియర్స్ నుంచే మీడియా నుంచి పాజిటివ్ టాక్, మంచి రివ్యూస్ తెచ్చుకుంది. ఫస్ట్ డే థియేటర్స్ లోనూ ప్రేక్షకులు సినిమా తమకు బాగా నచ్చిందనే రెస్పాన్స్ ఇచ్చారు. 
 
యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా రోజు రోజుకూ చేరువవుతోంది. దీంతో డే 1 కంటే బెటర్ గా డే 2 కలెక్షన్స్ డే 2 కంటే డే 3 కలెక్షన్స్ దక్కుతున్నాయి. "లవ్ గురు" సినిమాలోని సన్నివేశాలు ఎంటర్ టైన్ చేస్తూనే ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ద్వేషించే భార్యను ప్రేమతోనే గెలవాలని ప్రయత్నించే భర్తగా విజయ్ ఆంటోనీ నటన అందరినీ మెప్పిస్తోంది. "లవ్ గురు" సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించగా..విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments