విజయ్ ఆంటోనీ దర్శకుడిగా బిచ్చగాడు 2

Webdunia
శనివారం, 24 జులై 2021 (19:31 IST)
Vijay Antony
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే.. తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు.
 
 తెలుగులో సైతం అయన సంగీతం అందించిన కొన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. ఎడిటర్ గా కూడా అయన కొన్ని సినిమాలకు పనిచేయగా ప్రస్తుతం తొలిసారి అయన దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిచ్చగాడు సినిమా కి కొనసాగింపుగా బిచ్చగాడు 2  సినిమా ని అయన తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.
 
ఇక ఈరోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబందించిన లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆయనను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

తమిళనాడులో హిందీ భాషపై నిషేధమా? ఎవరు చెప్పారు? సీఎం స్టాలిన్ వివరణ

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తను హత్య చేయించిన భార్య

పోటీ పరీక్షల్లో సెక్స్‌కు సంబంధించిన మార్కులు కూడా వస్తాయంటూ... విద్యార్థినిలకు టీచర్ వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments