Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ భార్యగా - బాలయ్య తల్లిగా విద్యాబాలన్...

తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకు

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (12:42 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో హీరో బాలకృష్ణ 64 పాత్రలలో కనిపించనున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనుండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానులని ఆనందింపజేస్తుంది.
 
బాలయ్య తల్లిగా అంటే సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ని ఎంపిక చేసారని అప్పట్లో టాక్స్ వినిపించగా ఇప్పుడు అదే నిజమైంది. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ అయితే సరిగ్గా ఉంటుందని భావించి ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 
 
'కహానీ', 'డర్టీ పిక్చర్స్', 'తుమ్హారీ సులు' వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులని ఈమె కొల్లగొట్టింది. ఈమె కొన్నాళ్లుగా ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తుందా లేదా అనే విషయాన్ని పెండింగ్ ఉండగా, ఇది ఇపుడు ఖరారైపోయింది. ఎన్టీఆర్ బయోపిక్‌తో విద్యా తెలుగు తెరపై కనిపించనుంది. మలయాళంలో పృధ్వీరాజ్, జెనీలియా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన 'ఉరుమి' సినిమాలో స్పెషల్ రోల్ చేసిన విద్యా బాలన్ మళ్లీ ఇన్నాళ్ళకి సౌత్ సినిమా చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments